Posts

హ కి వత్తులు వాడినప్పుడు నియమానికి మినహాయింపులు (exceptions)

  *Letters in  Red  are for pronunciation purposes only and should not be written that way* హ కి ఒత్తులు ఇచ్చినప్పుడు ఎలా ఉచ్చరించాలి?  సహజముగా ఒక హల్లుకి ఒత్తు ఇచ్చినప్పడు, మనము వ్రాసిన క్రమములోనే ఉచ్చరిస్తాము, కానీ "హ"కు ఒత్తు ఇచ్చినప్పుడు మాత్రం, అపవాదము ఉంది. నియమము 1  - "హ" కు "మ", "న", "ణ" ఒత్తు ఇచ్చినప్పుడు మాత్రం, ఒత్తుని ఉచ్చరించి తరువాత "హ" ను ఉచ్చరించాలి .  ఉదాహరణలు:  బ్రహ్మ ( బ్రమ్హ/బ్రమ్‌హ ), జాహ్నవి ( జాన్హవి/జాన్‌హవి ),  అపరాహ్ణం  ( అపరాణ్హం/అపరాణ్‌హం ) నియమము 2  - "హ" కు "మ", "న", "ణ" కాక ఏ ఒత్తు వచ్చినా, హల్లు తరువాత ఒత్తుని ఉచ్చరించాలి ఉదాహరణకి బాహ్యము, ప్రహ్లాదుడు, హ్రస్వము, విహ్వలుడు, హ్రీం, వాహ్యాళి.

అరసున్న ఉన్నప్పుడు ఉచ్చారణ

  *Letters in  Red  are for pronunciation purposes only and should not be written that way* పదంలో అరసున్న ( ఁ) వాడినప్పుడు ఎలా ఉచ్చరించాలి?  అరసున్నని అర్థానుస్వారము అని కూడా పిలుస్తారు.  అరసున్న వాడుక ఈ  మధ్య  తగ్గిపోయింది, కానీ కావ్యాలలో ఎక్కువగా వాడేవారు.  వ్రాసేటప్పుడు పదంలో అరసున్న లేకపోతే పదానికి అర్థం మారిపోతుంది. అందుకే వాడుక తెలుసుకోవడం ముఖ్యం. నియమము 1  - అరసున్న పదం మధ్యలో వస్తే, ఉచ్చారణ చేసేటప్పుడు, i. కొన్ని పదాలకి సున్న ఉన్నట్టుగా పలకాలి ఉదాహరణలు (అరసున్న ఉన్నప్పుడు పదం యొక్క అర్థం, అరసున్న లేనప్పుడు పదం యొక్క అర్థం ఎలా ఉంటుంది):  అఁట ( అంట ) = ఆశ్చర్యార్థకము అట = అచ్చట కాఁచు  ( కాంచు ) = వేఁడిచేయు,  వెచ్చచేయు కాచు = కాపాడు,  రక్షించు ii. కొన్నిటికి అరసున్న లేనట్టుగా (silent) పలకాలి ఉదాహరణలు:  అరుఁగు = వీది అరుగు                                             గాఁడి = గొడ్లుమేయుస్థలం                             నేఁత = నేయుపని అరుగు = వెళ్ళు, పోవు                                               గాడి =   బండి                                                   నేత = రాజు         

సున్న ఉన్నప్పుడు ఉచ్చారణ

*Letters in Red  are for pronunciation purposes only and should not be written that way* పదంలో సున్న ( ం) వాడినప్పుడు ఎలా ఉచ్చరించాలి?  సున్నని బిందువు/పూర్ణబిందువు, అనుస్వారము/పూర్ణానుస్వారము అని కూడా పిలుస్తారు.  నియమము 1 - సున్న పదము మధ్యలో ఉన్నప్పుడు, సున్న తరువాత వచ్చే అక్షరం ఏ వర్గంలో ఉంటే, ఆ వర్గానికి సంబంధించిన అనునాసికములను ( ఙ ,  ఞ ,  ణ ,  న ,  మ) ఉచ్చరించాలి.  ఉదాహరణలు:  వేంకటేశ్వర ( వే ఙ్కటేశ్వర ), పింగాణి ( పి ఙ్గాణి ) పంచమి ( ప ఞ్చమి ), మంజరి ( మ ఞ్జరి ) పాండవులు ( పాణ్డవులు ), కంఠము ( కణ్ఠము ) చందమామ ( చన్దమామ ), పంతము ( పన్తము ) ఱంపము ( ఱమ్పము ), బింబము ( బిమ్బము )                      నియమము 2 - సున్న పదము మధ్యలో ఉన్నప్పుడు, సున్న తరువాత వచ్చే అక్షరం  య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ ఐనట్టైతే, "మ" ఉచ్చరించాలి. ఉదాహరణలు:  సంయుక్త ( సమ్యుక్త ), అం శము ( అమ్శము ), సింహము ( సిమ్హము ) నియమము 3 - సున్న పదము చివర ఉన్నప్పుడు, "మ్" ఉచ్చరించాలి ఉదాహరణలు:  పదం ( పదమ్‌ ), పుష్పం ( పుష్పమ్‌ ), పందెం ( పన్దెమ్‌ )