సున్న ఉన్నప్పుడు ఉచ్చారణ
*Letters in Red are for pronunciation purposes only and should not be written that way*
పదంలో సున్న ( ం) వాడినప్పుడు ఎలా ఉచ్చరించాలి?
సున్నని బిందువు/పూర్ణబిందువు, అనుస్వారము/పూర్ణానుస్వారము అని కూడా పిలుస్తారు.
నియమము 1 - సున్న పదము మధ్యలో ఉన్నప్పుడు, సున్న తరువాత వచ్చే అక్షరం ఏ వర్గంలో ఉంటే, ఆ వర్గానికి సంబంధించిన అనునాసికములను (ఙ, ఞ, ణ, న, మ) ఉచ్చరించాలి.
ఉదాహరణలు:
వేంకటేశ్వర (వేఙ్కటేశ్వర), పింగాణి (పిఙ్గాణి)
పంచమి (పఞ్చమి), మంజరి (మఞ్జరి)
పాండవులు (పాణ్డవులు), కంఠము (కణ్ఠము)
చందమామ (చన్దమామ), పంతము (పన్తము)
ఱంపము (ఱమ్పము), బింబము (బిమ్బము)
నియమము 2 - సున్న పదము మధ్యలో ఉన్నప్పుడు, సున్న తరువాత వచ్చే అక్షరం య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ ఐనట్టైతే, "మ" ఉచ్చరించాలి.
ఉదాహరణలు:
సంయుక్త (సమ్యుక్త), అంశము (అమ్శము), సింహము (సిమ్హము)
నియమము 3 - సున్న పదము చివర ఉన్నప్పుడు, "మ్" ఉచ్చరించాలి
ఉదాహరణలు:
పదం (పదమ్), పుష్పం (పుష్పమ్), పందెం (పన్దెమ్)
Comments
Post a Comment