అరసున్న ఉన్నప్పుడు ఉచ్చారణ
*Letters in Red are for pronunciation purposes only and should not be written that way*
పదంలో అరసున్న ( ఁ) వాడినప్పుడు ఎలా ఉచ్చరించాలి?
అరసున్నని అర్థానుస్వారము అని కూడా పిలుస్తారు.
అరసున్న వాడుక ఈ మధ్య తగ్గిపోయింది, కానీ కావ్యాలలో ఎక్కువగా వాడేవారు. వ్రాసేటప్పుడు పదంలో అరసున్న లేకపోతే పదానికి అర్థం మారిపోతుంది. అందుకే వాడుక తెలుసుకోవడం ముఖ్యం.
నియమము 1 - అరసున్న పదం మధ్యలో వస్తే, ఉచ్చారణ చేసేటప్పుడు,
i. కొన్ని పదాలకి సున్న ఉన్నట్టుగా పలకాలి
ఉదాహరణలు (అరసున్న ఉన్నప్పుడు పదం యొక్క అర్థం, అరసున్న లేనప్పుడు పదం యొక్క అర్థం ఎలా ఉంటుంది):
కాచు = కాపాడు, రక్షించు
ఉదాహరణలు:
అరుఁగు = వీది అరుగు గాఁడి = గొడ్లుమేయుస్థలం నేఁత = నేయుపని
అరుగు = వెళ్ళు, పోవు గాడి = బండి నేత = రాజు
ఆఁకరము = ఆగ్రహము చాఁగుట = వృద్ధియగుట పలుఁగు = తెల్లనిరాయి
ఆకరము = ఉనికి చాగుట = నడచుట పలుగు = చెడ్డవాడు
ఏఁడు = సంవత్సరం చూఁడు = కాన్పు
ఏడు = 7 అంకె (సంఖ్య), ఏడుపు చూడు = కనుమ
ఊఁక = ఊఁగుట తరుఁగు = తగ్గిపోవు
ఊక = పొట్టు తరుగు = త్రుంచు
ఊఁడు = ఊగించు తీఁగ = లత
ఊడు = రాలిపోవు తీగ = చెఱువు ముందు స్థలం
ఊఁతము = పట్టు తోఁడు = పైకెత్తు
ఊతము = కట్టబడినది తోడు = ఆన
ఊఁదర = పొగ దాఁక = వరకు
ఊదర = ఒక విధమైన గడ్డి దాక = పాత్ర, కుండ
కాఁపు = రైతు దాఁపరించు = దొంగలించు
కాపు = ఫలించుట దాపరించు = ప్రాప్తించు
నాఁడు = రోజు, కాలము దాఁపు = దాచుకొను
నాడు = దేశము, ప్రాంతము దాపు = దగ్గర
నియమము 2 - అరసున్నాని రెండు పదాల సంధికి (సరళాదేశ సంధి) వాడినప్పుడు సంధిలో రెండవ పదం మొదటి అక్షరం యొక్క ఉచ్చారణ మారుతుంది (సరళములు, వాటి సంబంధిత పరుషములుగా ఉచ్చరంచాలి)
ఉదాహరణలు:
రీతిఁదోడన్ (రీతి తోడన్)
మీదఁజెప్పెద (మీద చెప్పెద)
Comments
Post a Comment