హ కి వత్తులు వాడినప్పుడు నియమానికి మినహాయింపులు (exceptions)

 

*Letters in Red are for pronunciation purposes only and should not be written that way*

హ కి ఒత్తులు ఇచ్చినప్పుడు ఎలా ఉచ్చరించాలి? 

సహజముగా ఒక హల్లుకి ఒత్తు ఇచ్చినప్పడు, మనము వ్రాసిన క్రమములోనే ఉచ్చరిస్తాము, కానీ "హ"కు ఒత్తు ఇచ్చినప్పుడు మాత్రం, అపవాదము ఉంది.

నియమము 1 - "హ" కు "మ", "న", "ణ" ఒత్తు ఇచ్చినప్పుడు మాత్రం, ఒత్తుని ఉచ్చరించి తరువాత "హ" ను ఉచ్చరించాలి

ఉదాహరణలు: 

బ్రహ్మ (బ్రమ్హ/బ్రమ్‌హ), జాహ్నవి (జాన్హవి/జాన్‌హవి), అపరాహ్ణం (అపరాణ్హం/అపరాణ్‌హం)


నియమము 2 - "హ" కు "మ", "న", "ణ" కాక ఏ ఒత్తు వచ్చినా, హల్లు తరువాత ఒత్తుని ఉచ్చరించాలి

ఉదాహరణకి బాహ్యము, ప్రహ్లాదుడు, హ్రస్వము, విహ్వలుడు, హ్రీం, వాహ్యాళి.

Comments

Popular posts from this blog

సున్న ఉన్నప్పుడు ఉచ్చారణ

అరసున్న ఉన్నప్పుడు ఉచ్చారణ